TV77తెలుగు రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ పరిధిలో అన్ని మండల, గ్రామాల్లో అగ్నిమాపక శాఖ అనుమతులతో బాణాసంచా దుకాణాలు నిర్వహించాలని రాజమహేంద్రవరం డివిజన్అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా దుకాణాలు అనుమతులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన అన్ని బాణాసంచా దుకాణాలకు అగ్నిమాపక అనుమతి తప్పనిసరిగా ఉండాలని లేనిపక్షంలో కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. భారీ స్థాయిలో మందుగుండు సామానం నివాసాల మధ్య లో నిల్వ ఉంచరాదని నివాసాలకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అగ్నిమాపక శాఖ అనుమతులు అన్నీ కచ్చితంగా పాటించాలని ఆయన తెలిపారు.