చోరీ కేసులో ఇద్దరు అరెస్టు


 

 TV77 తెలుగు రాజానగరం క్రైమ్ :

ఈనెల 15-11-2021 తేదీన తెల్లవారుజామున 5 గంటలకు, రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామస్తుడు  తన పండ్ల వ్యాపారం కోసం తన  TVS  XL మోటార్ సైకల్ పై దివానుచెరువు వెళ్తుండగా ఫరిజల్లిపేట గ్రామ శివారులో చెరువు దగ్గర ముగ్గురు వ్యక్తులు బండిని ఆపి, అతనిని చాకుతో బెదిరించి అతని నుంచి రూ. 30,000/-  ఒక  మొబైల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రాజనగరం పోలీసులు Cr.No. 803/2021 U/s 341, 384 r/w 34 IPC ప్రకారం కేసు నమోదు చేసినారు.  ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి, ఈస్ట్ జోన్ డి.ఎస్.పి, ని ఎ.టి.వి.రవికుమార్  నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అన్ని కోణాలలో క్షుణంగా దర్యాప్తు చేయగా వచ్చిన సమాచారం మేరకు ది. 19.11.2021వ తేదీన రాత్రి సుమారు 9.30 గంటలకు, రాజానగరం ఇన్స్పెక్టర్  యం.వి. సుభాష్ , యస్.ఐ శ్రీ యం.డి జుబేర్ తమ సిబ్బందతో కలిసి రాజానగరం హైవే లో కలవచర్ల జంక్షన్ వద్ద కేసులో ముద్దాయిల లో ఇద్దరు 1) కర్రెడ్ల దేవి వర ప్రసాద్. 2) మాదసి సాయి, నీ రాజమహేంద్రవరం అను వార్లను పట్టుకుని వారి వద్ద నుండి రెండు చాకులు మరియు 5000/-నగదు మరియు ఒక పల్సర్ మోటార్ సైకల్ ను స్వాధీనపర్చుకొని సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడమైనది.ఈ  కేసును త్వరితగతిన చేదించి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కృషిచేసిన  పోలీసు  అధికారులు మరియు సిబ్బందిని అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి అభినందించారు.