ఎంపి ఎక్సోపిషియ ఓటు అక్కడే


 TV77 తెలుగు కొండపల్లి :

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో నమోదైన ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు..??

కీలకమైన సమాచారం సేకరించిన జర్నలిస్టుల ఐక్య వేదిక....!!!

అక్కడ ఓటు ఉండి మళ్లీ  కొండపల్లి మున్సిపాలిటీ కి ధరకాస్తు చేసుకోవడం పట్ల భిన్న వాదనలు....!!!

అనవసర రాద్దాంతం చేసి కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ వైసీపీ నేతల ధ్వజం....!!!

కొండపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ కొలువుల పై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఎవరికి పాలకవర్గ పగ్గాలు వెళతాయో అంతు చిక్కక పోవడం తో అటు ప్రజలు, ఇటు గెలిచిన అభ్యర్థులల్లో సైతం అయోమయం నెలకొంది. అయితే ముఖ్యంగా ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు చుట్టు తిరుగుతున్న రాజకీయం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది.15 మంది సభ్యుల బలంతో ఉన్న టిడిపి కేడర్ కు ఎంపి ఎక్సోఫిషియ  ఓటు అత్యంత కీలకంగా మారింది.. అయితే ఎంపి ఓటు తో పాలకవర్గం ఏర్పాటు చేస్తామని ధీమా తో ఉన్న టిడిపి శ్రేణులకు ఊహించనీ పరిణామం చోటుచేసుకునే  అవకాశం కనిపిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ఏర్పాటుకు ఆయన ఓటు కొండపల్లి మున్సిపాలిటీ కి వినియోగించే అవకాశం లేదని వైసీపీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇరు పార్టీల వాదన నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటు నమోదు చేసుకున్న ఎంపి కేశినేని నాని మళ్ళీ కొండపల్లి మున్సిపాలిటీ ఎక్సోఫిషియ ఓటుకు దరకాస్తు చేసుకోవడం పట్ల కొండపల్లి వ్యాప్తంగా చర్చనీయమసం గా మారింది.ఇక ఇదే విషయం పై వైసీపీ నేతలు మాట్లాడుతూ టిడిపి శ్రేణులు అన్ని తెలిసి ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడుతున్నారు.ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అన్న ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది... 


రిపోర్టర్,సత్య..మైలవరం