TV77 తెలుగు కొండపల్లి:
కొండపల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పాటుపై కొనసాగుతున్న సందిగ్ధత...!!
ఎంపి కేశినేని నాని ఎక్సోఫీషియ ఓటుకు దరకాస్తు చేసుకున్నట్లు ప్రచారం చేస్తున్న టిడిపి నేతలు...!!!
గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా విస్తృత ప్రచారానికి తెర తీసిన తెలుగు తమ్ముళ్లు....!!!
టిడిపి నేతల పొంతన లేని ప్రచారం దేని సంకేతం..??
కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన 14 మంది టిడిపి అభ్యర్థులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తో కొండపల్లి పుర పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిన్నటిదాకా ప్రచారం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు మరో ప్రచారానికి తెర తీశారు. ఎంపి ఎక్సోఫీషియ ఓటు తో టిడిపి పాలకవర్గం ఏర్పాటు కాబోతుందని అలానే చైర్మన్ అభ్యర్థి పలానా అని సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పటివరకు ఎంపి కేశినేని నాని ఎక్సోఫిషియ ఓటు నమోదు చేసుకోలేదని తాజాగా ధరకాస్తు చేస్తున్నట్లు మరో ప్రచారం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం కేవలం గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త పడటం కోసమే అంటూ అధికార వైసీపీ శ్రేణులు కొట్టిపడేస్తున్నారు. ఇప్పటివరకు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఒకసారి పరిశీలన చేస్తే టిడిపి 14, వైసిపికి 14 సీట్లు వచ్చాయి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి టిడిపి వైపు మొగ్గు చూపడం తో పాలక వర్గం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లు అందరూ భావించారు.కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎమ్మెల్యే ఎక్సోఫిషియ ఓటు కీలకంగా మారడం ఎంపి ఎక్సోఫిషియ ఓటు ధరకాస్తు చేయకపోవడం తో అంతా తారుమారు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొండపల్లి మున్సిపాలిటీ పుర పాలక వర్గం కొలువుదీరడం లో సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూన్న యావత్ కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలను కొంత అయోమయానికి గురి చేస్తున్న అంశం. ఏ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు అనే విషయం పై క్లారిటీ లేకపోవడం తో సందిగ్ధత కొనసాగుతోంది.
నిన్నటి కథనానికి కొనసాగింపు గా.
రిపోర్టర్,సత్య.. మైలవరం