నేటి తరం రాజకీయ నాయకులు ఏబీ నాగేశ్వరరావును ఆదర్శంగా తీసుకోవాలి


 

TV77తెలుగు రాజమండ్రి :

నిస్వార్ధ ప్రజా సేవకు నిజాయితీ పరిపాలనకు ప్రతీక గా నిలిచిన స్వతంత్ర సమరయోధుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తొలి చైర్మన్ డాక్టర్ ఏ బి నాగేశ్వరరావు. ను నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని విశ్వనాథశాస్త్రి అన్నారు. స్థానిక సీతంపేట గ్రంథాలయంలో శనివారం డాక్టర్ ఎబి నాగేశ్వరరావు స్మారక పురస్కారం అందుకున్న సందర్భంగా శాస్త్రి ఆవిధంగా అన్నారు. ఈ సందర్భంగా శాస్త్రి మాట్లాడుతూ. ముక్కుసూటితనం నైతికత ఆయన సొంతమని పెద్ద పెద్ద పదవులు చేసినప్పటికీ ఏనాడు కుటుంబ స్వార్థం చూసుకో లేదన్నారు. మన్యం ఉమా మాట్లాడుతూ ఏబీ నాగేశ్వరరావు పంతులు జీవితం స్ఫూర్తి  కలిగిస్తుందని విద్యార్థులకు పాఠంగా పెట్టాలని కోరారు. గ్రంథాలయం లైబ్రరీయన్ రాజు మాట్లాడుతూ ఏబీ నాగేశ్వరరావు జయంతి వర్ధంతి ఈ నెలలోనే రావడం శుభ పరిమాణాన్ని అన్నారు. అనంతరం ఆయన కుమారుడు కృష్ణ శర్మ రచించిన గోదావరి తరగల అనే పుస్తకాన్ని శాస్త్రి ఆవిష్కరించారు.