TV77తెలుగు కొండపల్లి :
అధికార పార్టీ విపరీత ధోరణిలో కూడా ఉవ్వేతున్న ఎగసిన తెలుగు తమ్ముళ్లు...!!
కొండపల్లి మున్సిపాలిటీ లో ఎక్కడ పోటీ చేసిన చట్టకుదురు బ్రదర్స్ దే పై చెయ్యి....!!!
పసుపు సైనికులుగా మొదలై ప్రజా ప్రతినిదులుగా ఎదిగిన చుట్టకుదురు శ్రీను...వాసు...!!
మరి ఈ ఎల్లో సైనికులకు టిడిపి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందా...???
కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతం అయ్యింది. మున్సిపల్ ఎన్నికల ఉత్కంఠ పోరు లో టిడిపి వైసిపి పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.అధికార వైసీపీ కి గట్టి పోటీ ఇచ్చిన టిడిపి అభ్యర్థుల్లో కొండపల్లి తెలుగు తమ్ముళ్లు చట్టకుదురు బ్రదర్స్ హవా మరోసారి నిరూపితం అయ్యింది.కొండపల్లి గడ్డ పై టిడిపి కార్యకర్తలుగా మొదలై పసుపు సైనికుల వలె పని చేసిన చట్టకుదురు శ్రీనివాస్, వాసు ఇప్పుడు ప్రజా ప్రతినిధులు గా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ లో తమ గళం వినిపించేందుకు సిద్ధం అయ్యారు. నిజాయితీ, నిబద్దత , క్రమశిక్షణ కలిగిన ఈ తెలుగు తమ్ముళ్లు తమ సత్తా ఏమిటో అధికార వైసిపికి రుచి చూపించారు. చుట్టకుదురు కుటుంబం అనాదిగా కొండపల్లి ప్రజల కోసం పని చేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.అధికార పార్టీకి ఎదురెళ్లి కేసులు పెట్టించుకున్న చుట్టకుదురు శ్రీనివాస్ తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు.ఇక కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలుపొందిన చుట్టకుదురు శ్రీనివాస్ , వాసు ప్రజా ప్రస్థానం కొనసాగించ నున్నారు.కొండపల్లి మున్సిపాలిటీ లో టిడిపి బలోపేతం కావడం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన ఈ ఎల్లో బ్రదర్స్ కి ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి గౌరవం తో సత్కరిస్తుందో వేచి చూడాలి.
రిపోర్టర్,సత్య..మైలవరం