ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం జీవో 42 రద్దు చేయాలి జిల్లా సిపిఎం నాయకులు డిమాండ్
TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాష్ట్రంలో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు న్యాయమైన కోరికల అమలు కోసం చేస్తున్న ఆందోళనలను ఉద్యమాలను, అణిచివేయడం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని జిల్లా సి.పి.ఎం నాయకులు టి. అరుణ్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ప్రభుత్వం పాటించిన ప్రజావ్యతిరేక, పోలీస్ అణిచివేత చర్యలన్నీ నేటి వైసీపీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ అనిచివేత చర్యలను నిలుపుదల చేయాలని లేకుంటే గత తెలుగుదేశం పార్టీకి కి ఎదురైనా దుర్గతి వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఇప్పుడు ఆ బాటలోనే వైసీపీ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనాన్ని చేస్తూ 42 జీవో తీసుకు వచ్చిందని ఈ జీవో ని వెంటనే రద్దు చేయాలని అరుణ్ డిమాండ్ చేశారు. ఈ జీవో లో మూడు ఆప్షనులు ఇచ్చారని ఇవి సరికాదని మొత్తం జీవో నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను విలీనం వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలను నాయకులను గృహనిర్బంధం పోలీస్ స్టేషన్ కు తరలింపును మానుకోవాలని అరుణ్ డిమాండ్ చేశారు.