TV77 తెలుగు చింతలపూడి క్రైమ్ :
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఫాతిమా పురం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన కేసులో అనుమానితులను అరెస్టు చేసిన చింతలపూడి పోలీసులు. మిగిలిన నిందితులను గురించి రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వి ఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కేసులు మన చింతలపూడి సరౌండింగ్ లో ఎక్కువగా జరుగుతున్నాయని ,దీనికి కారణం తల్లిదండ్రులు తమ పిల్లలు కు ఫోన్లు కొనివ్వడం, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి చేయడం వలన పిల్లలు చెడు మార్గంలో నడవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు నిందితుడు మున్నా కి సహకరించిన, కారు డ్రైవర్ ఫిరోజ్ ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కోర్టు లో హాజరు పరుస్తున్న టు తెలిపారు.