వైఫల్యాలను ప్రశ్నించే ప్రశ్నాస్త్రం


 TV77తెలుగు కొండపల్లి :

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచిన ధరణికోట విజయలక్ష్మి...!!!


టిడిపి నుండి 16 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న టిడిపి మహిళా నాయకురాలు...!!!


కొండపల్లి మున్సిపాలిటీ టిడిపి మహిళా నేత , ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రస్నాస్త్రం ధరణికోట విజయలక్ష్మి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచారు.. పుర పోరులో 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్ధిగా అధికార వైసీపీ కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ప్రతిపక్ష టిడిపి ఫైర్ బ్రాండ్ గా , ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక లా పని చేస్తున్న ధరణికోట ఇప్పుడు ప్రజా క్షేత్రం లో తన బలాన్ని నిరూపించుకునేందుకు  అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. అధికార వైసీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష గళాన్ని బలంగా వినిపిస్తున్న మహిళా నేత ధరణికోట విజయలక్ష్మి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలవడం సర్వత్రా చర్చనీయాంశం గా మారింది.. ఆది నుండి ఒకే పార్టీలో కొనసాగుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడే తత్వం ఆమె గెలుపుకు బాటలు వేస్తుంది.. 16 వ వార్డు ప్రజలు తనను విశ్వసిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు...


 రిపోర్టర్ సత్య

మైలవరం