ఉద్యోగుల పై దాడులు ప్రభుత్వ పతనానికి సంకేతం మేడా శ్రీనివాస్


 

 TV77తెలుగు రాజమహేంద్రవరం:

విద్యార్థులు - ఉద్యోగుల పై దాడులు ప్రభుత్వ పతనానికి సంకేతం . 

బిజెపి చదరంగం లో ఏపి విల విల. 

సమర్థ నాయకత్వాన్ని ప్రోత్సహించని ఓటర్లు.

ఏపిలో అనిచ్చితి కారణం నేతల బలహీనతలు. 

సేవ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యమమే శరణ్యం. 

ఉప్పెన లాంటి ప్రజా ఉద్యమంతోనే  ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడుకో గలదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రసంగించారు . ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసుకోకుండా ఉద్యోగులు, విద్యార్థులు పై దాడులు చేయటం లాఠీలు జులిపించటం  హేయమైన చర్య అని, ఉద్యోగులకు పిఆర్సి అమలు చేస్తామని,ఉచితంగా ఇండ్లు పంపిణి చేస్తామని, బకాయిలున్న  డి ఏ తక్షణమే అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత పక్కాగా అమలు పరుస్తామని, ఉద్యోగులుకు వడ్డి లేని ఋణాలు మంజూరు చేస్తామని, ఏటా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని, ఉద్యోగ కుటుంబ బిడ్డలకు నాణ్యత గల కార్పొరేట్ విద్యను ఉచితంగా అమలు పరుస్తామని,విశ్రాంత ఉద్యోగులకు రెట్టింపు పెన్షన్ల తో పాటుగా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించి వారికి బాసటగా నిలుస్తామని, ప్రసూతి ఉద్యోగ మహిళలకు ప్రత్యేక రాయితీలతో పాటుగా ప్రత్యేక సెలవులు, సౌకర్యాలు కల్పించుతామని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీత భత్యాలు పెంచుతామని నోటికొచ్చిన మోసపూరిత  హామీలను నేటి సర్కార్ మరువటం అన్యాయ మైన చర్యగా భావించాలని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై మోది (బిజెపి)సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతుందని, ఏపి లోగల అపార ఖనిజ సంపదను మోది సర్కార్ రాజకీయ అవసరాలకు ఏపి సర్కార్ ను బ్లాక్ మెయిల్ చేస్తు దోచుకుపోతున్నారని,కార్పొరేట్ల వ్యాపార అభివృద్ధి కి ఏపిలో భూ సారం తో పాటుగా పర్యావరణం  కలుషితమైతు  బలహీనపడుతుందని, ప్రశ్నించలేని దుస్థితిలో ఏపి సర్కార్ మోనం వహిస్తుందని, ప్రత్యేక హోదా, విభజన హామీలకు ద్రోహం చేసిన బిజెపి పార్టికి తిరుపతి లో అమిత్ షా ప్రధాన అతిధి స్థానంలో దక్షిణాది రాష్ట్రాల సదస్సు ను  నిర్వహించే అర్హత లేదని, సదస్సులో ప్రధాన అంశాలలో ప్రత్యేక హోదా విభజన హామీలుకు సంబంధించి అజండా లో ఏపి సర్కార్ చేర్చలేక పోవటం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకు అవమానం జరిగినట్టుగా వుందని, ఏపి బిజెపి పార్టీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, జరుగుతున్న అన్యాయం కోసం ప్రశ్నించే నేతలు లేకపోవటం దురదృష్టం అని, ప్రధాన ప్రతిపక్షం అయిన టిడిపి పార్టి కూడా అమిత్ షా " గో బ్యాక్ " అని నిరశన తెలపకపోవటం సిగ్గుమాలిన చర్యగా భావించాలని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఏపిలో పాలకులు శ్రమను దోచుకుంటు ఓటర్లను ఉచిత పథకాలకు, ఓటుకు నోటు తీసుకోవటానికి బానిసలుగా మార్చివేశారని,  ఆ కారణంగా ఓటర్లు సమర్థులను ఎన్నుకోలేక పోతున్నారని, ఏపి ని కరువు రాష్ట్రం గా దిగజారుస్తున్నారని, ఆకలితో అలమటించే ప్రజల శాతం రోజు రోజు కు పెరిగిపోతుందని, ఏపి అభివృద్ధి కి నోచుకోని రాష్ట్రం గా మిగిలిపోయే ప్రమాదం ముంచుకొస్తుందా ! అని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారని, ఏపిలో విద్యార్థులకు, ఉద్యోగులకు, కార్మిక కర్షకులకు, రైతులకు, భూ స్వాములకు, శ్రామికులకు, మహిళలకు, సామాన్య ప్రజానీకానికి, పసి బిడ్డలకు సైతం భద్రత లేకుండా పోయిందని, కనీస అవసరాలు, కనీస వసతులకు ప్రజలు నోచుకోని పాలనా స్థితిలో ప్రభుత్వాలకు ప్రజలు పన్నులు చెల్లిస్తు ప్రభుత్వ పాలనకు బాసటగా నిలుస్తున్నారని, ప్రశ్నించే హక్కును పాలకులే తొక్కి పడేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని, హక్కుల కోసం మాట్లాడితే అక్రమ కేసులు, లాఠీ దెబ్బలతో వేధించటం బాధాకరమని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. ఏపిలో ప్రజా ఉద్యమాలు బలహీన పడటానికి ప్రధాన కారణం ఉద్యమాల్లోకి రాజకీయ దళారి నేతలు కీలకంగా వుండటం అని,ఉవ్వెత్తున లేచిన సమైఖ్యఆంధ్రా ఉద్యమాన్ని సీమాంధ్రా ఉద్యమంగా మార్చి కేసీఆర్ కు, విదేశీ పెట్టుబడి దారులకు అమ్ముడు పోయారని, విభజన సమయంలో కాంగ్రెస్ పాపం చేస్తే నమ్మకంగా పనిచేయాల్సిన నేతలు హైదరాబాద్ ఆస్తులు కోసమో, వ్యాపారాల కోసమో, ఋణ మాఫీల కోసమో ఆంధ్రప్రదేశ్ చారిత్రిక త్యాగాలను, ఉజ్వల భవిష్యత్ ను, ఏపికి రావలసిన లక్ష కోట్లు పై బడి ఆర్ధిక వాటాను స్వార్ధ రాజకీయ అవసరాలకు తాకట్టు పెట్టేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేసారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను కాపాడుకోవటానికి రాజకీయాలకు అతీతంగా ఉప్పెన లాంటి ప్రజా ఉద్యమ పోరాటం ఆసన్న మైనదని, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం తో 13 జిల్లాల ప్రజలు కదిలి ఆంధ్రప్రదేశ్ కీర్తి ని జాతీయ స్థాయిలో చాటాలని, 2024 ఎన్నికలకు  విద్యావంతులును, సంఘ సంస్కర్తలను, ఉద్యమ వీరులను చట్ట సభలకు పంపే విధంగా ఉద్యమ ప్రణాళికకు సిద్ద పడాలని అందుకు మేము సైతం అంటు ప్రతి ఆధ్రుడు  గురుతర భాద్యతగా భావించి ముందుకు రావాలని ఆర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సభకు ఆర్పిసి నగర సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ దుడ్డె త్రినాద్,లంక దుర్గా ప్రసాద్, ఎండి హుస్సేన్, వల్లి శ్రీనివాసరావు, దుడ్డె సురేష్, వర్ధనపు శరత్ కుమార్, మోర్త ప్రభాకర్, వాడపల్లి జ్యోతిష్, సిమ్మా దుర్గారావు,పి. ప్రసాద్,  ఎస్ కే మీరా వల్లి, పిల్లాడి ఆంజనేయులు, కొలిపిల్లి లక్ష్మణరావు, దోషి నిషాంత్, అన్నవరపు దుర్గా చార్యులు, కే. బుజ్జి తదితరులు పాల్గొని యున్నారు. 


మేడా శ్రీనివాస్,MA, LLM, MA(Jour) 

      అధ్యక్షులు, 

రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్