ఘనంగా చందన నాగేశ్వర్ జన్మదిన వేడుకలు


 TV77తెలుగు రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం స్మార్టుసిటీ కార్పొరేషన్ ఛైర్మన్ రాజమండ్రి రూరల్ కో-ఆర్డినేటర్ చందన నాగేశ్వర్  జన్మదిన వేడుకలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ మరియ రూరల్ నియోజకవర్గ పరిధి కడియం మండలం మరియు రాజమండ్రి రూరల్ మండలాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పుష్పగుచాలతో చందన నాగేశ్వర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.