TV77 తెలుగు పిఠాపురం :
పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై జీప్ డ్రైవర్ గా పనిచేస్తున్న హోంగార్డ్ హవా చేస్తుండడం పోలీసు అధికారులను. తోటి సిబ్బందిని సిగ్గుపడేలా చేస్తుంది. సుమారుగా పదేళ్లుగా తనకున్న రాజకీయ పలుకుబడితో ఇదే టౌన్ లో చక్రం తిప్పుతూ పట్టణంలో కలెక్షన్ కింగ్ గా ఇతని పేరు మారుమోగుతోంది. ఇతను ఆగడాలపై , వసూళ్లపై ఫిర్యాదు చేయడానికి వ్యాపారస్తులు. బాధితులు భయపడుతున్నారు. ఏమైనా ఈ సీనియర్ హోంగార్డ్ కలెక్షన్ కింగ్ పై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు జిల్లా ఎస్పీని కోరుతున్నారు.