భారీ వర్షాలు 48గంటల్లో


 TV77తెలుగు అమరావతి :

 అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 29న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి తర్వాత 48 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు. దక్షిణ శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని .వీటి ప్రభావంతో రాగల రెండు రోజుల వ్యవధిలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.