ఒకే ప్రాంగణంలో వృద్ధాశ్రమం అనాధ ఆశ్రమం ఎంపీ భరత్ రామ్

ఒకే ప్రాంగణంలో వృద్ధాశ్రమం అనాధ ఆశ్రమం

 ఎంపీ నిధులతో ఆధునిక ఆశ్రమం నిర్మాణం

 TV77తెలుగు  రాజమహేంద్రవరం:

 వృద్ధాశ్రమాన్ని, అనాధ ఆశ్రమాన్ని ఒకే ప్రాంగణంలో నిర్మాణం చేయడం వల్ల వృద్ధులకు తమ పిల్లలే దగ్గర ఉన్నట్టుగా ఉంటుందనే ఆలోచనతో ఈ విధమైన నిర్మాణాలను ఒకే ప్రాంగణంలో చేపట్టామని రాజమహేంద్రవరం ఎంపీ, వై ఎస్ ఆర్ సి పి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జీవకారుణ్య సంఘంలో రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ ఇటువంటి సందర్భాల్లో చేపట్టే సేవా కార్యక్రమాలు చిన్నవా పెద్దవా అనేది చూడకూడదని చేసేవా మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలన్నదే ప్రధానం అని పేర్కొన్నారు. ఎంపీ నిధులతో ఈ ప్రాంగణంలో వృద్ధాశ్రమానికి అనాధ ఆశ్రమాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు ఇందిరా ప్రియదర్శిని బధిరుల పాఠశాల ఆశ్రమాన్ని కూడా ఇదే ప్రాంగణంలో తీసుకొస్తే మరింత ఉపయుక్తంగా ఆశ్రమాన్ని నడపవచ్చు అన్నారు. ఈ ప్రాంగణంలో గోసాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మహాత్మా గాంధీజీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముందుగా జీవ కారుణ్య సంఘం ప్రాంగణంలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వృద్దులకు టవల్స్, పండ్లు పంపిణీ చేశారు. రాజమహేంద్రి మహిళా కళాశాల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామీణ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ పిల్లి నిర్మల కుమారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో ఆర్ శ్రీనివాసరావు, రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినిలు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు వెంకటేశ్వరరావు రామకృష్ణ, ఉల్లూరి రాజు, మార్గాని బుజ్జి, విత్తనాల శివ, రేలంగి వెంకటేశ్వరరావు, కోమల కిషోర్ కుమార్, నెల్లి సర్వేశ్వరరావు, అను యాదవ్, మాజీ ఎంపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, నాయకులు వేముల యేసు బాబు, మారిశెట్టి వెంకన్న, మట్టా వీరబాబు గౌడ్, తొంటా సత్తిబాబు, తదితరులు, పాల్గొన్నారు.