TV77తెలుగు నరసరావుపేట :
నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ దుకాణాల్లో మరోసారి మద్యం నిల్వలు మాయమయ్యాయి. రొంపిచర్ల, నరసరావుపేట మండలాల పరిధిలోని రెండు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం నిల్వలతో పాటు నగదు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఓ ప్రజా ప్రతినిధి వద్ద పనిచేసిన వ్యక్తి ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. దుకాణంలో మద్యం విక్రయాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.20 లక్షల మేర ఇతను సొంతానికి వాడుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది గుర్తించారు. నగదుతో పాటు మద్యం నిల్వల్లో తేడా ఉండటాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరో మద్యం దుకాణంలో కొంత మేర మద్యం నిల్వలను సిబ్బంది పక్కదారి పట్టించారు. నిల్వల్లో తేడా ఉండటాన్ని దుకాణాన్ని పర్యవేక్షించే ఎక్సైజ్ కానిస్టేబుల్ గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లటంతో మద్యం డిపో మేనేజర్ ఆధ్వర్యంలో రెండు దుకాణాల్లో పని చేస్తున్న సిబ్బందిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ సాగిస్తున్నారు. అయితే టీ తాగి వస్తానని చెప్ఫి. ఓ సూపర్‌వైజర్ బయటకు వెళ్లి అటే పరారైనట్లు తెలిసింది. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం, నగదు మాయమైన విషయాన్ని డిపో మేనేజర్ శ్రీనివాసులు దృష్టికి విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.