ముగ్గురు యువకుల పై లారీ డీ


TV77తెలుగు   కడప: 

 చాపాడు మండలం నాగులపల్లి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపు తప్పి ముగ్గురు యువకులు కిందపడ్డారు. కింద పడ్డ యువకుల పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.