TV77తెలుగు రాజమహేంద్రవరం :
రోజురోజుకి పెట్రేగిపోతున్న వైసిపి గూండాయిజంను ప్రజలు సహించబోరని, అన్యాయంగా,దారుణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ అన్నారు.పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కార్యక్రమానికి వెళ్తున్న కాశి నవీన్ కుమార్ ను పోలీసులు గృహ నిర్భందించారు.బయటకు వెళ్ళడానికి వీలు లేదంటూ అడ్డుకున్నారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, జగన్మోహనరెడ్డి సిఎం అయ్యాక దాడులు,హత్యలు పెరిగిపోయాయని అన్నారు.శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని,పోలీసులు వైకాపా నిబంధనలే పాటించడం విచారకరమన్నారు.జగన్ సిఎం అయ్యాక ప్రతిపక్ష పార్టీల గొంతును అణిచి వేయడమే లక్ష్యంగా పరిపాలిస్తూ అక్రమ కేసులు,అక్రమ గృహ నిర్భందాలకు పాల్పడటం దారుణమన్నారు.ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడని ప్రజలు ఆశిస్తే రాష్ట్రాన్ని గూండాయిజంతో నింపుతున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కవులూరి వెంకట్రావు, కొమ్మర్తి బాబ్జీ,ఉల్లింగి రాజు,మోతా నాగలక్ష్మి, పెదగాడ సూరాచార్యులు,జోగా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.