TV77తెలుగు మైలవరం:
చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే....!!!
పెద్ద ఎత్తున హాజరైన కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ శ్రేణులు...!!
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ప్ల కార్డుల ప్రదర్శన....!!!
టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మైలవరం వేదికగా జరుగుతున్న జనాగ్రహదీక్ష రెండవ రోజు కొనసాగింది... మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యం లో జరుగుతున్న ఈ నిరసన ప్రదర్శనకు కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.. ఈ సందర్భంగా టిడిపి నాయకుల వైఖరిని తప్పుబడుతూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు... ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వాఖ్యలపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ప్ల కార్డుల ద్వారా నిరసన ప్రదర్శన చేపట్టారు... ప్ల కార్డుల ప్రదర్శనలో మునగాల శివారెడ్డి, నల్లమోతు చిన్నయ్య, నల్లమోతు ప్రకాష్ ఉన్నారు...
మైలవరం ..రిపోర్టర్, సత్య