TV77తెలుగు పిడుగురాళ్ల :
పిడుగురాళ్ల 23వ వార్డ్ యస్.టి.కాలనీ లోని అంగన్ వాడి కేంద్రములో వై యస్ ఆర్ సంపూర్ణ పోషణ కిట్స్, జగనన్న పోషకాహారంను వార్డ్ కౌన్సిలర్ జులకంటి శ్రీరంగ రజని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు జగనన్న పోషకహారమైన. అటుకులు, రాగి పిండి, జొన్న పిండి, బెల్లం, కిస్ మిస్ లు, ఖార్జురం, ఫోర్టి పైడ్ బియ్యం, పాలు, కంది పప్పు, నూనె, కోడి గుడ్లు, బాలాంమృతం వంటి పోషకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జూలకంటి మాట్లాడుతూ గర్భిణులు ఈ పోషక పదార్థాలు వాడటం వలన పుట్టే పిల్లలు ఎంతో ఆరోగ్యం గా బలంగా ఉంటారని తెలిపెరు. ఈ కార్యక్రమంలో వై యస్ ఆర్ సి పి నాయకులు, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జులకంటి శ్రీనివాసరావు, 13 వ సచివాలయం మహిళ పోలీస్ పి. సౌందర్య, అంగన్ వాడిలు అంగడి దుర్గ, కంబ శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.