TV77తెలుగు రాజమహేంద్రవరం :
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా, మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్ రావు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి , కలిసి కోవిడ్ పాండమిక్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో పాటు వైరస్ నిర్మూలనలో శ్రమించి కోవిడ్ బారినపడి విధి నిర్వహణలో అమరులైన అర్బన్ జిల్లా హెచ్.సి-2391 కట్టా వీర వెంకట రమణ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, మీకు అండగా మేమంతా ఉన్నామని వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చి, అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి పోలీస్ డిపార్ట్మెంట్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్బంగా డీజీపీ వారికి భరోసా కల్పించారు.