డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి విన్నపం యస్ ఐ కే సతీష్ కుమార్


TV77తెలుగు  కొయ్యలగూడెం:
ప్రపంచంలో జన్మ పొందటానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి నడవడానికి రెండు సంవత్సరాలు, స్కూల్ కి వెళ్లడానికి మూడు సంవత్సరాలు, ఓటు హక్కు 18 సంవత్సరాలు, ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు, పెళ్లి కోసం 25 నుండి 30 సంవత్సరాలు, ఇలా ఎన్నో సందర్భాల్లో వేచి ఉంటాం, కానీ ఓవర్ టేక్ చేసే  సమయంలో , వాహనాలు నడుపుతున్నప్పుడు, 30 సెకండ్ల కూడా ఆగలేక పోతున్నాము తర్వాత తప్పిపోయి ఏమన్నా జరిగి యాక్సిడెంట్ అయితే హాస్పటల్లో గంటలు, రోజులు, వారాలు ,నెలలు, కొన్ని సెకండ్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో ప్రజలు ఆలోచించాలి ముందు వెళ్ళేవాడు వెళ్ళని.వెనకాల హాయిగా వెళ్ళిపో  దయచేసి సరైన వేగం , సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, హెల్మెట్ వాడు తు తమ వాహనాలను నియంత్రణలో ఉంచుకునీ నడపండి , మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.

మీకోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు, మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరువకండి. జాగ్రత్తగా వెళ్లండి. హ్యాపీ జర్నీ.   

యస్ ఐ,  కే సతీష్ కుమార్. కొయ్యలగూడెం,

రిపోర్టర్.. పృథ్వి గౌడ్