మద్యం పట్టివేత


 

TV77తెలుగు జగయ్యపేట:

 వత్సవాయి మండలంలోనిచిట్యాల గ్రామం పరిసరప్రాంతాలు కృష్ణా జిల్లా ఎస్పీ  సిద్ధార్థ కౌశల్  ఆదేశాల మేరకు నందిగామ సబ్ డివిజన్ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి  పర్యవేక్షణలో జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్  ఆధ్వర్యంలో వత్సవాయి పోలీసుల మెరుపు దాడి.

వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం కి చెందిన రామకృష్ణ మరియు నాగరాజు అను ఇద్దరు వ్యక్తులు స్కూటీపై 340 బాటిళ్లను చందర్లపాడు లోని రాజేష్ అనే వ్యక్తికి మద్యం తరలిస్తుండగా చిట్యాల గ్రామ శివారులో రాబడిన రహస్య సమాచారం మేరకు ఈ ఇద్దరి ముద్దాయిలను స్కూటీ తో సహా 340 బాటిళ్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. వీరిపై పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వత్సవాయి ఎస్. ఐ. జి .మహా లక్ష్ముడు మాట్లాడుతూ యువత తక్కువ సమయంలో ఎక్కువ లాభార్జన పొందాలనే ఉద్దేశంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమ మద్యం తరలిస్తు పట్టుబడుతున్నారని ఈ విధంగా ఎవరైనా అక్రమంగా భజన కోసం ఇతర రాష్ట్రాల మధ్య అని తరలించడం గాని బెల్ట్ షాపులు నడిపి మద్యాన్ని అధిక ధరకు విక్రయించడం గాని చేయడం నేరమని ఆ విధంగా చేసిన ఎడల వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ మధ్యాన్ని చేజిక్కించుకోవడం లో నైపుణ్యం ప్రదర్శించిన ఎస్ బి ఐ ఎస్ ఐ జనార్ధన్ , వత్సవాయి ఎస్ఐ మహాలక్ష్ముడు, కానిస్టేబుల్ బుచ్చయ్య, సుధాకర్, ఎస్ పి ఓ లను, స్టేషన్ సిబ్బందిని సి ఐ పి. చంద్రశేఖర్  డిఎస్పీ . నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.