తన ప్రాణాలకు తెగించి కాపాడిన జగ్గంపేట సీఐ సురేష్ బాబు

TV77తెలుగు జగ్గంపేట:

ఆత్మహత్య చేసుకునేందుకు పోలవరం కాలువలో దూకి నా కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి కాపాడిన జగ్గంపేట సీఐ సురేష్ బాబు,  ఒక  తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ, వి. సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ, వి. సురేష్ బాబు  పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. కాలువలో దూకిన బాలుడు తల్లిని వెలికితీసిన పోలీసులు. ప్రస్తుతం బాలుడు సృహ లో ఉన్నాడు తల్లి మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇంకా కూతురు ఉండి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏదేమైనా నా ప్రాణాలకు తెగించి, ధైర్య సాహసాలు చేసి పీకల లోతు నీటిలో మునిగి బాధితులను రక్షించిన సీఐ సురేష్ బాబు