TV77తెలుగు ఢిల్లీ :
రెండురోజుల విరామం తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. లీటర్‌కు 35 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.79కు ముంబయిలో రూ.110.75కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ.101.40ను, దిల్లీలో రూ.93.52ను తాకింది. గత రెండు వారాల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది పదమూడోసారి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 16 సార్లు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 84 డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయికి చేరడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలపై కేంద్రం గత ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్లు సంపాదించిందని, ఆ మొత్తం ఏమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.