అల్పపీడనం ఆదివారం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా తీరం

TV77తెలుగు అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల అదే ప్రాంతంలో అల్పపీడనం శుక్రవారం ఏర్పడిందని, ఇది రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ఆదివారం నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు ప్రయాణించే అవకాశముందని పేర్కొన్నారు.