మహిళా పోలీసుల ప్రోటీషన్ డిక్లరేషన్ ప్రాక్టికల్ పరీక్ష ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
iraila 13, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
అర్బన్ జిల్లా ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి , అర్బన్ జిల్లా పరిధిలో పని చేస్తున్న మహిళా పోలీసులకు (20) రాజమహేంద్రి మహిళా కళాశాల నందు ప్రోటీషన్ డిక్లరేషన్ ప్రాక్టికల్ప పరీక్ష లో భాగంగా దిశ యాప్ డౌన్ లోడ్ల ప్రాజెక్ట్ వర్క్ చేయుట ప్రారంభించినారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ పై వారికి ఉన్న అపోహలు, సందేహాలను ఎస్సీ అడిగి తెలుసుకొని, వాటిని నివృత్తి చేసి, ఈ దిశ యాప్ యొక్క ప్రాముఖ్యతను వారికి వివరించి, ప్రతి మహిళా పోలీసు ఈ ప్రాజెక్ట్ వర్క్ సమయంలో కనీసం 200
దిశా యాప్ డౌన్లోడ్ లు జరిగేల, సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. అలాగే ఎస్పీ. మహిళల సంరక్షణ, భద్రత, ఇసొలేటెడ్ సమస్యాత్మక ప్రదేశాల మ్యాపింగ్, మహిళా స్నేహపూర్వక టీం ఏర్పాటు మరియు సామజిక మాద్యం గురించి పరిజ్ఞానం, శాంతి భద్రతా సమస్యలు, గ్రామంలో చెడు నడత గల వ్యక్తుల గురించి సంక్షిప్తముగా అవగాహనా కల్పించినారు. అలాగే ది. 13.09.2021 నుండి,18.09.2021వ తేదీ వరకు జరిగే ఈ ప్రాజెక్ట్ ప్రాక్టికల్ పరీక్షల ప్రక్రియను జోనల్ డిఎస్పీలు మరియు యస్.హెచ్.ఓలు స్వయంగా పరిశీలించాలని ఎస్పీ ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్సీ (లా & ఆర్డర్) కె.లతా మాధురి, సెంట్రల్ జోన్ డిఎస్పీ
జి.వి.సంతోష్, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ యస్.హెచ్.ఓ మధుబాబు మరియు సుమారు 150 మంది రాజమహేంద్రి మహిళా కళశాల విద్యార్థినులు పాల్గొన్నారు.