కొరియర్, పార్సిల్ సర్వీస్ సంస్థల ఓనర్ మేనేజర్ లతో సమావేశం నిర్వహించిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

TV77తెలుగు రాజమహేంద్రవరం: 
 రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో కొరియర్, పార్సల్ సర్వీస్ నిర్వహిస్తున్న ఓనర్  మేనేజర్ లతో సమావేశం నిర్వహించి,వారికి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా.అర్బన్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.పార్సెల్ బుక్ చేసిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు (ఆధార్ కార్లు, ఫోన్ నెంబర్) పరిశీలించి రికార్డులో నమోదు చేయాలి అని సూచించారు. తమ కొరియర్ పార్సెల్ సర్వీస్ ఆఫీసుల బుకింగ్ కౌంటర్ నందు కెమరాలు తప్పక అమర్చాలని, 24 గంటలు సీసీటీవీ కెమరాలు పనిచేసే విధంగా చూడాలని,కనీసం నెల రోజులు సి సి ఫుట్ ఏజ్ బ్యాక్ ఆప్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని సూచించినారు.బుక్ చేసిన పార్సెల్స్ లో ఎముందో, క్షుణ్ణంగా పరిశీలించి, అనుమానం వస్తే బుక్ చేసిన వ్యక్తిఎదుటే ఆ పార్సెల్ ను తనిఖీ చేసి తిరిగి ప్యాక్ చేయాలని సూచించినారు.పార్సెల్ నందు నిషేదిత పదార్థాలు (గంజాయి, నల్ల మందు, బంగారం, వెండి, ప్రేలుడు పదార్థాలు, బాణసంచా) మరియు ఇతర నిషేదిత వస్తువులు రవాణా చేయరాదని హెచ్చరించారు. అలాగే నగదు రవాణా పూర్తిగా నిషేధం అని తెలియచేసారు. కొరియర్ పార్సెల్ సర్వీస్ నందు పనిచేస్తున్న సిబ్బంది మరియు డెలివరీ బాయ్స్ యొక్క పూర్వాపరాలు పూర్తిగా విచారించిన అనంతరం వారిని నియమించుకోవాలని సూచించడం.ముఖ్యంగా కొరియర్,పార్సిల్ సర్వీస్ నందు తెచ్చే పార్సిల్ పై వారికి ఏమైన అనుమానం ఉన్నయడల వెంటనే అట్టి సమాచారమును సంబందిత పోలీసు అధికారులకు తెలియజేస్తే చెప్పినవారి పేర్లు రహస్యంగా ఉంచబడునని తెలియ పరచినారు.అనంతరం అర్బన్ జిల్లా ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి డి.శ్రీనివాస రెడ్డి, సెంట్రల్ జోన్ డిఎస్పి జె.వి.సంతోష్, ఈస్ట్ జోన్ డిఎస్పి ఎ.టి.వి.రవికుమార్, సౌత్ జోన్ డిఎస్పి కుమారి యం.శ్రీలత,ట్రాఫిక్ డివిజన్ డిఎస్పి కె.వి.యన్.వరప్రసాద్, డిఎస్పి క్రైమ్ జి. గురునాధ బాబు,యం,జె.వి.భాస్కర రావులు మరియు కొరియర్, పార్సల్ సర్వీస్ సంస్థల ఓనర్లు మేనేజర్లు పాల్గొన్నారు..