ప్రజలకు మంచి చేసే పోటీతత్వం పోలీసుల్లో పెరగాలి అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

TV77తెలుగు రాజమహేంద్రవరం: అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఐ.పీ.యస్.జిల్లా పోలీసు కార్యాలయం, కాన్ఫరెన్స్ హాల్ నందు అర్బన్ జిల్లా పరిధిలో 2020-21వ సంవత్సరమునకు గాను పోలీసు శాఖలో విశిష్ట సేవలను అందించిన 22 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రములను ప్రధానము చేయడమైనది.ఈ సందర్భంగా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ. పోలీసులు చేసిన గుడ్ వర్క్, చూపిన డెడికేషన్, విధి నిర్వహణ పట్ల ఉన్న బాధ్యత ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రజలకు మంచి చేస్తే కచ్చితంగా గుర్తింపు వస్తుందని, మిమ్మల్ని చూసి మీ సహోద్యోగులు ప్రేరణ పొంది మంచి చేసే పోటీతత్వం సిబ్బందిలో బాగా పెరగాలని పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవ, విలువలను మరింత పెరిగేలా అందరూ కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇంకా బాగా పని చేసి మరిన్ని అవార్డులు పొందాలని కోరినారు.