మండల ప్రజాపరిషత్ పదవి మాదిగలకు కేటాయించాలలి

TV77తెలుగు కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల ప్రజా పరిషత్ పదవి (ఎంపిపి) పదవి మాదిగలకు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. శనివారం స్థానిక “ యాపిల్ రెసిడెన్సీ” లో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ విస్సంపల్లి సిద్దు మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ బయ్య వరపు రాజేశ్వరరావు మాదిగ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం పెద్దలు పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులను కొయ్యలగూడెం మండల ఎంపిపి పదవిని మాదిగలకు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. కొయ్యలగూడెం మండలం లో స్థానికేతరులకు పదవులు కట్టబెట్టడం కాకుండా, ఒకే ఇంటిలో రెండు పదవులు ఇచ్చే విధంగా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారని ఇది చాలా అన్యాయమని ఆ ఆలోచనను మార్చుకొని కొయ్యలగూడెం మండలం లో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం అని మండల ప్రజా పరిషత్ పదవి మాదిగలకు ఇవ్వాలని రాజేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ యువసేన నాయకుడు సనమండ్ర కనకరాజు,ధవులూరి గంగరాజు,దూలపల్లి వెంకటరమణ, జొన్నకూటి నాగరాజు ,రాష్ట్ర మహిళా నాయకురాలు నమ్మిన లక్ష్మి కుమారి, కే అశోక్, పెనుమకుల వెంకటేష్, రాజేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దేవరపల్లి రత్నం బాబు, బి. రమేష్ , బల్లి శంకరం తదితరులు పాల్గొన్నారు.