రాజమహేంద్రవరం రివర్ బే వద్ద తూర్పు నావికా దళం ఆద్వర్యంలో నిర్వహించిన స్వర్ణం విజయ్ వర్స్ విజయోత్సవం
iraila 07, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
మంగళవారం సానిక రివర్ బే వద్ద తూర్పు నావికా దళం ఆద్వర్యంలో నిర్వహించిన
స్వర్ణం విజయ్ వర్స్ విజయోత్సవ స్మారక సభకు జిల్లా కలెక్టరు వారు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ
బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం రావడానికి అప్పట్లో భారత దేశం పూర్తి సహకారం అందించిందని, ఆ యుద్ధం
జరిగి 50 ఏళ్లవుతున్న నేపధ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని స్వర్ణం విజయ్ వర్స్ గా భారత ప్రభుత్వం ప్రకటించి,ఈ ఏడాదంతా స్వర్ణ విజయ్ వర్ఫ్ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. యుద్ధంలో విజయానికి ప్రతీకగా గతేడాది డిశంబరు 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం వద్ద నాలుగు విజయజ్యోతులను వెలిగించి నాలుగు దిక్కులకు పంపారని దక్షిత భారత దేశం వచ్చిన విజయజ్యోతి వివిధ ప్రాంతాలు తిరుగుతూ రాజమహేంద్రవరం మంగళవారం చేరుకుందన్నారు. ఈ ఏడాది డిశంబరు 16
నాటికి స్వర్ణ విజయ్ వర్డ్ జ్యోతి డిల్లీకి చేరుతుందన్నారు. భారత రక్షణ దళాల దీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారత దేశం విజయం సాధించిందన్నారు. భారత రక్షణ ఆర్మీ ఎయిర్ పోర్సు ధళాలు సమాంతరంగా దీరోచితంగా పోరాడి విజయాన్ని కైవసం చేసుకున్నాయన్నారు. అమర వీరుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తి, ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దళాల విజయానికి, సాహసానికి ప్రతీక స్వర్ణ విజయ్ వర్స్ అన్నారు. పాకిస్తాన్‌ను భారత్ ఓడించి 2021 డిశంబరు 3 నాటికి యాభై ఏళ్ళు నిండుతాయన్నారు. అమర
వీరుల త్యాగాలను గుర్తు చేసుకొని అతిధులు నివాళ్ళులర్పించారు. ఆనాటి విజయస్ఫూర్తిపై అవగాహన కల్పించారు. ఐదు దశాబ్దాలు క్రితం భారత్-పాక్ యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. అమరులైన భారత జవాన్లకు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. యుద్ధంలో పాల్గొన్న విశ్రాంత ఉద్యోగులను మాజీ సైనికులను జిల్లా కలెక్టరు వారికి నావికా దళ అధికారులు పరిచయం చేయగా వారి యొక్క యోగక్షేమాలను జిల్లా కలెక్టరు సి.హరికిరణ్ అడిగి తెలుసుకున్నారు. తొలుత స్వర్ణ విజయ్ వర్స్ విజయోత్సవ కాగడా ర్యాలీని లాలాచెరువు సెంటరు సార్జంట్ రవి ప్రసాద్ విగ్రహం వద్ద నుంచి రివర్ బే వరకు నిర్వహించారు. విజయోత్సవ సభలో ఆనాడు దేశ రక్షణ కోరకు పొరాడిన ప్రతి కుటుంబాన్ని స్మరించుకుని ఆయా కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్మ్డ్ పోర్సు పట్ల ఎంతో గౌరవాన్ని ఉంచాలని వారు కుటుంబాలకు దూరంగా దేశరక్షణే పరమావదిగా ప్రాణాలు సహితం ఫజ్ఞంగా పెట్టి పోరాడారని కొనియాడారు.ఈ విజయోత్సవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలన్నారు. ఈస్టు పాకిస్తాన్ గా వున్న భూభాగంలో బంగాదేశ్ ఆవిర్భ వించిందన్నారు. సైనికులు కుటుంబాలకు పూర్తి సహకారాన్ని అందిస్తానని సైనిక సంక్షేమ బోర్డు అధికారి లేదా నేరుగా మాజీ సైనికులు తనను సంప్రదించ వచ్చునని మీ సమస్యలు పరిష్కారానికి తన వంతు బాధ్యత వహించడం జరుగుతుందన్నారు.తాను కోరుకొండ సైనిక్ పాఠశాలలో చదివానని ఎస్.సి.సి లో కూడా పనిచేసానన్నారు. పిల్లలకు మనదేశ ఖ్యాతిని వివరించి స్ఫూర్తిని నింపి దేశ రక్షణకు పాటుపడాలనే దిశగా ప్రోత్సహించాలన్నారు.వారిజిల్లానుంచి సుమారు 552 మంది సైనికులు 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొనడం విశేషమన్నారు.అర్బన్ ఎస్సీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ 1971 ఇండో పాక్ యుద్ధంలో ఆర్మీ ఎయిర్ఎర్సు. నేవీ ధళాలు దీరోచితంగా సమాంతరంగా తమ తమ బలగాలతో పోరాడి విజయం సాధించారన్నారు. ఆ మూడు ధళాలు ఎన్నో రకాలు యిబ్బందులను ఎదుర్కొని ఎంతో గొప్ప సర్వీసును అందించాయనడంలో ఎటువంటి సందేహంలేదన్నారు. కేవలం 1971 డిశంబరు 3వ తేదీ నుంచి డిశంబరు 16వ తేదీవరకు మాత్రమే యుద్ధం కొనసాగిందన్నారు. కేవలం 13 రోజుల కాలవ్యవధిలో అత్యంత చాకచక్యంగా మనబలగాలు పాకిస్తాన్ తో పోరాడాయని కొనియాడారు. నగర పాలక సంస్థ కమీషనరు ఎం అభిషిక్ కిశోర్ మాట్లాడుతూ ఆనాడు
సైనికులలో ఉండే క్రమశిక్షణ పోరాట దీక్షలు
కొనియాడదగినవన్నారు. యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన 90 మంది సైనికులు స్వాదీనంలోనికి తీసుకొని మన దేశస్టులు మరలా వారిని సురక్షితంగా పాకిస్తాన్ కు అప్పగించడం,ఎంతో గొప్ప విషయమన్నారు. నాలుగు విక్టరీ జ్యోతులు 2021డిశంబరు 16 నాటికి తిరిగి డిల్లీ
చేరుకుంటాయన్నారు. జాస్తి వివిఎస్ మూర్తి మాట్లాడుతూ ఇండో పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన ఘట్టాలను
ఆర్మీ ఎయిర్ పోర్టు నావికాదళాలు చేసిన కృషిని జలాంతర్గామిలు, ఆయిల్ ట్యాంక్లను ద్వంసం చేసిన సంఘటనలు సభలో వివరించి వారి సాహసోపేత నిర్ణయాల వల్ల మనం ఆనాడు విజయభేరిని మోగించగల్గిగామన్నారు.
ఈ కార్యక్రమంలో పలు బ్రిగేడియర్లు కెప్టెన్లు మాట్లాడుతూ ఆనాడు మన బలగాలు దీరోచితంగా పోరాటాలు
సాగించాయని వారి యొక్క స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్క లెక్టరు ఇలాక్కియా, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు అధికారి జి సత్య ప్రసాద్. కెప్టెన్ వి.కె.సి రావు, ఏఎస్పీలు లత మాధురి,రమాదేవి, బ్రిగేడియరు వై వి శర్మ,గోవిందు, వరుణ్ బాటియా, విశిష్ట అతిధులు మాజీ సైనికుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.