ప్రజల వద్దకే రాజన్న'రచ్చబండ’కార్యక్రమంలో ఎంపీ మార్గాని పిలుపు

TV77తెలుగు రాజమహేంద్రవరం: గత రెండేళ్ల కాలంలో రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన అభివృద్ధిని చూపి రాబోయే నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ పిలుపునిచ్చారు.రాజమహేంద్రవరం నగరంలో వార్డుల విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన 51వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ’ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రుడా ఛైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డిలకు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.తొలుతగా డివిజన్‌లోని దుర్గా నగర్‌కు వచ్చిన ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, రౌతు సూర్యప్రకాశరావు, మేడపాటి షర్మిలారెడ్డిలకు అజ్జరపువాసు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.దుర్గానగర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర భారీ బాణాసంచా కాల్పులు, తీన్‌మార్‌ బృందాల నృత్యాలతో పాదయాత్ర ఆద్యాంతం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.ఈ సందర్భంగా ఎంపీ మార్గని భరత్‌ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం పీఠాన్ని కైవసం చేసుకుంటుందని,ప్రజలు జగనన్న ప్రజారంజక పాలనకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.గత రెండేళ్ల కాలంలో రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఎన్నికలను ఎదుర్కోనున్నామన్నారు.రాజమహేంద్రవరంలోని రోడ్‌లను, జంక్షన్‌లను ఉన్నత ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశామన్నారు.సచివాలయ వ్యవస్థను ప్రజలకు అనుసంధానం చేస్తూ అభివృద్ధికి జగనన్న ఆశయంతో ముందుకు పెడుతున్నామన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రాజమహేంద్రవరం మేయర్‌ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు.ప్రజల వద్దకే రాజన్న రచ్చబండలో గత మూడు రోజులుగా రాజన్న రచ్చబండ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.ప్రజలు ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమానికి అపూర్వ స్వాగతం పలుకుతూ విశేష స్పందన కనబరచుతున్నారని అన్నారు.క్షత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలను అక్కడికక్కడే పరిశీలిస్తున్నామని, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని చెప్పారు.గత రెండు సార్లు రాజమహేంద్రవరాన్ని టిడిపి కైవసం చేసుకోవడానికి ప్రధాన కారణం టిడిపి హయాంలో పుష్కరాలు రావడంతో తద్వారా చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు టిడిపి చేసిన అభివృద్ధి అనుకునే భావనలో ఉండి టిడిపిని అందలం ఎక్కించారని తెలిపారు. అయితే గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన సమయంలో కూడా అభివృద్ధి పనులు ఆపకుండా వైఎస్‌ఆర్సిపి నగరాన్ని అభివృద్ధి చేసిందని గుర్తుంచుకోవాలన్నారు.విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో అనేది నిరూపిస్తున్నామని చెప్పారు. వార్డులోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి, మదర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీపీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌,వైఎస్సార్‌ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్‌,పార్లమెంటు జిల్లా వైకాపా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్‌, మాజీ కార్పొరేటర్లు బర్రె కొండబాబు,మింది నాగేంద్ర,గుత్తుల మురళీధర్, పిల్లి నిర్మల, వైకాపా నాయకులు మజ్జి అప్పారావు, యజ్జరపు మరిదియ్య, అన్నపూర్ణ రాజు, కొత్త విజయ రాజలక్ష్మి, కొత్త బాల మురళి, బిల్డర్ చిన్న, ఓంకార్, ఆదిలక్ష్మి, ఉల్లూరి రాజు,మారిశెట్టి వెంకటేశ్వరరావు, మార్గాని చంటిబాబు,మార్గాని గణేష్ బాబు, కొమ్ముజు దుర్గారావు,బుడ్డిగ చిన్న శ్రీను, రేలంగి వెంకటేశ్వరరావు, మణికంఠ రెడ్డి,చవ్వాకుల సుబ్రహ్మణ్యం, గారా చంటిబాబు, తహశీల్దార్‌ సుస్వాగతం, మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వీరభద్రరావు, వార్డు పరిధిలోని గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.