TV77తెలుగు విజయవాడ:
సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న తాడిగడప రామానగర్‌కు చెందిన రౌడీషీటర్ షేక్. సందాని (21)ని పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాసులు విజయవాడ నగర బహిష్కరణ చేశారు. పోలీస్ కమిషనరేట్ ప్రకటనలో వివరాలు తెలుపుతూ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్‌గా ఉన్న షేక్ సందాని గంజాయి, ఇతర నేరాల్లో జైలుకు వెళ్లి బయటకు వచ్చాడన్నారు. అతను నేర ప్రవృత్తిని మార్చుకోక పోవటంతో శాంతి భద్రతకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ఆరు నెలల పాటు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరణ చేశామన్నారు. రౌడీషీటర్ల పై నిఘా ఏర్పాటు చేశామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.