అంతర్జాతీయ చిరుదాన్యాల దినోత్సవం
iraila 17, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
శుక్రవారం స్థానిక కేంద్ర పోగాకు
పరిశోధనా కేంద్రం నందు. అంతర్జాతీయ చిరుదాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకొని చిరుధాన్యాలపై
అవగాహన సదస్సును మరియు మొక్కల పెంపకంపై నిర్వహించారు. వర్చువల్ విధానంలో కేంద్ర వ్యవసాయ,
మరియు రైతు సంక్షేమం మంత్రి వర్యులు నరేంద్ర సింగ్ తోమర్ అంతర్జాతీయ చిరుదాన్యాల దినోత్సవాన్ని
ప్రారంబించారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ ఆహారంలో పోషకాలు కల్గిన చిరుదాన్యాల
నేడు అత్యంత కీలకంగా మారాయని రానున్న కాలమంతా సేంద్రీయ ఉత్పత్తులపై ఆదారపడి జీవించాల్సిన
పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. చిరుదాన్యాలలో అదిక మాంసకృత్తులు, పీచుపదార్ధాలు, ఖనిజలవణాలు,
ఆసిడ్డు కలిగి వుండటంతోపాటు, నెమ్మదిగా సులభంగా జీర్ణమమ్మే లక్షణాలు ఉన్నాయన్నారు. రోజువారీగా
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాక కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా
కొంతమేర తిరిగా పొందవచ్చునని పరిశోధనలు ద్వారా వెల్లడైయిందన్నారు. విభిన్న ప్రాంతాలలో పండించే
పంటలలో చిరుదాన్యాలు చాలా ప్రధానమైనవన్నారు. చిరుధాన్యాలు సాగు, వాడకం కూడా మనకు
ఎక్కువేనన్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగెలు, అండు కొర్రలు
వంటి తొమ్మిది రకాలు చిరుదాన్యాలు వర్షాదార వ్యవసాయానికి అనువైన పంటలని తక్కువ పెట్టుబడితో,
తక్కువ సమయంలో దిగుబడి అందుకునే ఈ పంటలు సాగువల్ల రైతుల కుటుంబాలకు ఆహార భద్రతతోపాటు
ఆదాయ సుస్థిరత లబిస్తుందన్నారు.జనాభా పెరుగుదల, హరిత విప్లవం నేపధ్యంలో దశాబ్దాలుగా ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్న వ్యవసాయ విధానాల వల్ల చిరుదాన్యాల సాగు తగ్గిపోయిందన్నారు. వాటి స్థానంలో వరి,గోదుమ పంటలకు ఇచ్చిన విపరీతమైన ప్రాదాన్యం మొత్తంగా వ్యవసాయ వ్యవస్థతోపాటు ఆహారపు అలవాట్లలో
తీవ్రమైన మార్పులను తీసుకు వచ్చిందన్నారు. కేవలం వరి గోదుమ తిండి తినడం వల్ల ఆహారంలో పోషక
సమతుల్యత దెబ్బతింటోందన్నారు. ఈ రెండు దాన్యాలే ప్రధాన ఆహారంగా తీసుకోవడంవల్ల మానవునికి
పూర్తిగా పోషకాలు అందక రోగనిరోధకశక్తి తగ్గుతున్న నేపధ్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు,మానవుని జీవన
ప్రమాణాల దృష్ట్యా మన పూర్వికుల సాంప్రదాయ చిరుదాన్యాలు సాగును పునరుద్ధరించి ఆహారపు అలవాటుగా
చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుభరోసా క్రింద ఒక్కొక్క రైతుకు
కేంద్ర రూ 6.500లు రాష్ట్ర ప్రభుత్వం రూ 7,500లు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా అందించడం
జరుగుతోందన్నారు. సిటిఆర్ఎ సంచాలకులు డాక్టరు డి దామోదర రెడ్డి చిరుధాన్యాల సాగు, మొక్కల
పెంపకాలుపై రైతులకు, వ్యవసాయ విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విశదీకరించి మొక్కలు, చిరుధాన్యాల విత్తనాల
కిట్లను పంపిణీ చేసి అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీనియరు వ్యవసాయ శాస్త్రవేత డాక్టరు
కె సరళ, శాస్త్రవేత బి హేమ తదితరులు పాల్గొన్నారు.