ప్రతి అర్జీదారుని సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలి సబ్ కలెక్టరు ఇలాక్కియా
iraila 06, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
డివిజనల్ స్థాయి అధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక సబ్ కలెక్టరు వారి కార్యాలయంలో ప్రజా
ఫిర్యాధుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని సబ్ కలెర్టరు అధ్యక్షతన నిర్వహించి ఆర్టీదారుల నుంచి
నేరుగా సమస్యలను వ్రాత పూర్వకంగా స్వీకరించారు. సుమారు 30 మంది అర్జీదారులు తమ తమ సమస్యలను
సబ్ కలెక్టరు వారికి అందజేసారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పందన సమస్యలను నిర్దేశిత
గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సమస్యను
క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కారాన్ని చూపాల్సిన భాధ్యత అధికారులపై వుందన్నారు. ఆలమూరు మండలం
చోప్పెల్లకు చెందిన ఆకుల చిన్నారావు,గుత్తుల పోతరాజు, గుత్తుల చంద్రమ్మ అనసూరి చంద్రరావులు తమకు
పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చిర్లదుర్గావేణి తన భర్త
సూర్యనారాయణ పబ్లిక్ హెల్త్ శాఖలో పనిచేస్తూ మరణించారని కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాన్ని
ఇప్పించాలని కోరారు. గ్రామీణ మండలం కాతేరుకు చెందిన వై, శ్యామ్యూల్ తన తండ్రి చిట్టెయ్య ఎక్స్ సర్వీసు
మెన్ అని, ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించిందని అ భూమిని మార్పుచేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ
ఇప్పటికి మార్పు చేయలేదని మార్పుచేయాలని కోరారు. శాటిలైట్ సిటీకి చెందిన బింగి తాతారావు పించన్
పునరుద్ధరించాలని,కుంగి సత్యజ్యోతి ఇంటి స్థలం ఇప్పించాలని కోరారు.ఇంకా చాల మంది పించన్లు
రావడం లేదని,రేషన్ కార్డుల విభజన సమస్యల వల్ల సామాజిక భద్రతా పించన్లు ఆగిపోయాయని వీటిని
పరిష్కరించాలని కోరారు.గొకవరం అచ్యుతాపురంలో ఇద్దరి భార్యల ఆస్తి తగాదాలను పరిష్కరించాలని
కోరారు.కాతేరు భరత్ నగర్ లో అక్రమంగా చర్చి నిర్మించడం జరుగుతోందని ఆ సమస్యకు పరిష్కార మార్గం
చూపాలని కోరారు.వాంటీ గృహాల నిర్మాణాలకు కొంత మంది లబ్ధిదారుని వాటా చెల్లించి 6 సంవత్సరాలు
దాటినా ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని నిర్మించి ఇవ్వాలి కోరారు.వేలిముద్రలు పడక దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించాలని ముక్తకంఠంతో సబ్ కలెక్టరు వారిని కోరగా వాటిని ఆయా
శాఖలకు నివేదించి పూర్తిగా విచారించిన పిమ్మట తగు పరిష్కార మార్గాలు చూపడం జరుగుతుందని సబ్
కలెక్టరు ఇలాక్కియా స్పష్టం చేసారు.ఈ కార్యక్రమంలో కార్యాలయపు ఎ.ఓ దేవి, కెఆర్ సి తాహసిల్దారు
వేదవల్లి, డిప్యూటీ డిఎంహెచ్ ఓ పి.కోమల, ట్రాన్సుకో ఇఇ తిలక్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ ఇఇ జి సోములు,డివిజనల్ పంచాయితీ అధికారి జె సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ కోర్డినేటర్లు ప్రియాంక, లేబరు అధికారి గోదావరి కేశవరావు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.