అక్రమాలపై సమాచారం ఇవ్వండి రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్

TV77తెలుగు రాజమహేంద్రవరం: అర్బన్ పోలీసు జిల్లా, స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (SEB) కంట్రోల్ రూమ్ ను (9493206171) ప్రభుత్వ నిషేదిత నాటు సారాయి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అక్రమ మద్యం, గంజాయి, గుట్కా, అక్రమ ఇసుక సరఫరా, నిల్వలు మొదలగు చట్ట వ్యతిరేక ఆసాంఘీక కార్యకలాపాలు నియంత్రణ చేయడానికి ప్రారంభించడమైనది. ఈ కంట్రోల్ రూమ్ నెం.కు ఇసుకను అధిక ధరలకు అమ్మినా, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా, నాటు సారాయి అమ్మకం, తయారీ మరియు రవాణా చేసినా, కల్తీ కల్లు, కల్తీ మద్యం, బెల్టు షాపులు నిర్వహించినా, ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ అమ్మకాలు జరిపినా, కోడిపందాలు & జూదము ఆడించినా, గంజాయి అమ్మకం, రవాణా, అక్రమ నిల్వలు, నిషేదిత గుట్కా నిల్వలు మరియు అమ్మకాలు చేసినా, ఇతర మత్తు పదార్దాల అమ్మకాలు, వినియోగము, నిల్వలు కలిగి ఉన్నా రాజమహేంద్రవరం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కంట్రోల్ రూమ్ ఫోన్ నం. 9493206171 కు సమాచారము తెలియజేయగలరు.సమాచారము తెలిపిన వారి వివరాలు గోప్యముగా ఉంచబడును.