రాజ రమేష్ ను పరామర్శించిన మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

TV77తెలుగు రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ: అస్వస్థతకు గురై బొల్లినేని (కిమ్స్ ) హాస్పిటల్స్ లో గత బుధవారం నుంచి చికిత్స పొందుతూ కోలుకుంటున్న రాజమండ్రి రౌండప్ ఎడిటర్, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.రమేష్ రాజాను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఎం. శ్రీరామమూర్తి,అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి, తదితరులు పాల్గొన్నారు.అలాగే ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి,డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి,పలువురు డైరెక్టర్లు విచ్చేసి పరామర్శించారు.