షర్మిల దీక్ష భగ్నం

TV77తెలుగు సైదాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు.అనంతరం అక్కడే దీక్షకు కూర్చున్నారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ నోరు విప్పి బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.