హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు యాక్సిడెంట్

TV77తెలుగు హైదరాబాద్: మెగా క్యాంప్‌కు చెందిన ప్ర‌ముఖ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు యాక్సిడెంట్ జ‌రిగింది.స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళుతున్న సాయితేజ్.బైక్ నుంచి కింద‌ప‌డి గాయ‌ప‌డ్డారు.ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు సాయితేజ్‌.అయితే దీనికి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.ప్ర‌స్తుతం హీరోగా న‌టించిన రిప‌బ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలకు సన్నద్ధమవుతుంది.రిపబ్లిక్ సినిమాలో సాయితేజ్,కలెక్టర్ పాత్రలో నటించారు.దేవ్ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది.