బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్

TV77తెలుగు పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలో గుంటూరు రోడ్ న్యూ కలీల్ రెస్టారెంట్ ఏరియాలో వాహనాల జనరల్ చెకప్ చేస్తుండగా ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా వస్తూ పోలీసులు చూసి పారిపోగా వారిని వెంబడించి పట్టుకొని ఆరాతీయగా, వారి వద్ద ఉన్న బైక్ చోరీకి గురైన బైకుగా గుర్తించారు, వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇద్దరు యువకులు బైక్ దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తులుగా నిర్ధారించుకొని, వారి వద్ద నుండి 3 లక్షల 50 వేల విలువగల మోటార్ వెహికల్ స్వాధీనపరచుకొని, కేసు నమోదు ఇద్దరిని రిమాండ్ కు, పంపిస్తున్నామని తెలియజేశారు, ఆ ఇద్దరు యువకులు పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ చెందిన వారిగా గుర్తించారు, వారి వర్ల సాగర్, చల్లా వెంకటేష్ గా పట్టణ ఎస్ఐ సమీర్ భాష ,తెలియజేశారు..