నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్

TV77తెలుగు హైదరాబాద్‌: నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను కీసర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠా లో ఒక మహిళ కూడా ఉంది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.