'స్పందన' కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించినప్పటికీ వచ్చిన ఫిర్యాదుదారులను నిరాశ పరచకుండా స్పందన కార్యక్రమంను నిర్వహించిన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

TV77తెలుగు రాజమహేంద్రవరం: అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి,జిల్లా పోలీసు కార్యాలయం నందు సామాన్య ప్రజల సమస్యల పరిష్కార వేదిక “స్పందన” కార్యక్రమంను నిర్వహించి, అర్బన్ జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను విని, వాటి పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, సదరు విషయం సంబంధిత అధికారులకు తెలియజేసి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపించి వారి సమస్యల పరిష్కారించాలని ఆదేశించినారు.