మెడికల్ షాప్ లోకి దూసుకు వచ్చిన కారు
iraila 19, 2021
TV77తెలుగు తెనాలి: వేగంగా వచ్చిన ఓ కారు తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న హరిత మెడికల్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఓ టూ వీలర్ ధ్వంసమైంది. మెడికల్ షాపులోని సామగ్రి ధ్వంసమైంది. సుమారు 4 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ద్రుశ్యాలు అక్కడే అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.