రైతులతో కలిసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో భారి ర్యాలీగా
iraila 17, 2021
TV77తెలుగు కడియం:
రేతుకోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం స్దానిక రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆద్వర్యంలో భారి ర్యాలీగా రైతులతో కలిసి ట్రాక్టర్లు నడుపుతూ బయలుదేరి ముందుకు సాగుతూ నడిచారు,ఆద్యంతం పోలిసులు అడుగడుగునా అడ్డుకోగా ఉద్రిక్తత మద్య చివరగా కడియం చేరుకుని తహశీల్దారు కార్యలయం వద్ద వినతిపత్రం అందజేసినారు.
పాయింట్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో దేశంలో రైతులను అంధకారంలో నెడుతున్నారు,
రాష్ట్ర ప్రభుత్వం రైతులు అప్పల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్దాయికి దిగజార్చింది,పంటలకు గిట్టుబాటు ధరలేక,ఎరువుల ఆకాశాన్ని అంటగా,కూలీల ఖర్చులు పెరిగిపోయి రాష్ట్రం ప్రభుత్వం నుంచి సహయం అందక వ్యవసాయ రంగం కుదేలుగా మారింది,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా విత్తనాలలపై మరియు ఎరువులపై రాయితీలు లేవని,వ్యవసాయ రంగం,నీటి రంగానికి కేటాయింపు చేసిన నిధులను పక్కధారి పట్టించారని,ధరలు స్దిరీకరణ కోసం కేటాయించిన 5 వేల కోట్లు ఏమయ్యయో కుడా తెలియదని,కొనుగోలు చేసిన దాన్యానికి డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని,రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు ఇవ్బలేని స్దితి,కౌలు రైతులను పట్టించుకునే వారు లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది,వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించి రైతులకు ఉరిబిగిస్తూన్నారని,అన్నారు....