ప్రమాదం నుండి రక్షించిన బస్ డ్రైవర్

TV77తెలుగు గోకవరం: గోకవరం మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు.