అదుపుతప్పిన బస్సు

TV77తెలుగు కర్నూల్: ఫ్లైఓవర్‌పై అదుపుతప్పిన బస్సు అమాంతం బ్రిడ్జి రెయిలింగ్‌ని ఢీకొని కింద పడేందుకు దూసుకెళ్లింది.కొద్ది భాగం బ్రిడ్జి అంచుల నుంచి కిందకి.మిగిలిన భాగం బ్రిడ్జిపై ఉండడంతో గాల్లోకి వేలాడింది. ఈ షాకింగ్ ఘటన డోన్ పట్టణంలో జరిగింది. అనంతపురం నుంచి కర్నూల్ వెళ్తున్న బస్సు డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై అదుపుతప్పింది.బ్రిడ్జి సైడ్ వాల్‌ని ఢీకొని దూసుకుపోయింది.ముందు టైర్ గాల్లో వేలాడుతూ అక్కడే ఆగిపోయింది.కొద్దిగా ముందుకు దూసుకెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగేది.ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు.బస్సు బ్రిడ్జిపైనే ఆగిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.బస్సు ఢీకొనడంతో రెయిలింగ్ బద్దలై కింద బైక్‌పై వెళ్తున్న యువకులపై పడింది. ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..