ధాబా హోటల్ లో పార్టీ చేసుకుని బిల్లు కట్టకుండా కత్తులతో బెదిరించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్

TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్: స్థానిక బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫ్రెండ్స్ దాబా లో కొందరు వ్యక్తులు నిన్న మధ్యాహ్నం భోజనం చేసి తర్వాత కొందరు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడే తింటూ బిల్లు కట్టకుండా హోటల్ మేనేజ్మెంట్ తో గొడవ పడుతూ ఆ నలుగురు కత్తి తో బెదిరించి వాళ్ల దగ్గర1000 తీసుకుని, వారు వేసుకొచ్చిన ఆటోలో పరారు అయినట్టు ఈస్ట్ జోన్ డి.ఎస్.పి రవికుమార్ ఈరోజు మీడియా ముందు తెలియపరిచారు. ఈ ముఠాను ఈరోజు అరెస్ట్ చేశామని వారి పేర్లు, శ్రీకర్,సూరిబాబు,సాయి, నవీన్, వీరు అన్నపూర్ణo పేట కు చెందిన వారని వీరిని కోర్టులో హాజరు పరుస్తాం అని డిఎస్పి రవికుమార్ తెలిపారు అలాగే ఈరోజు ఇద్దరు బైక్ దొంగలను కూడా అరెస్ట్ చేశామని వారి మీద మండపేటలో పలు కేసులు ఉన్నాయని వారిని కూడా కోర్టు ముందు హాజరు పరుస్తామని డి ఎస్ పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో లో బొమ్మూరు సీఐ కే లక్ష్మణ్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్స్ కె జగన్ మోహన్ రావు, ఆర్ శివాజీ లు పాల్గొన్నారు.