మహాగణపతి నిమజ్జనం

TV77తెలుగు ఖైరతాబాద్: నవరాత్రులు పూజలు చేసిన గణనాథులకు అట్టహాసంగా శోభాయాత్ర నిర్వహించి గంగమ్మ వడిలో నిమజ్జనం చేస్తాం. అది ఏటా జరిగేదే కదా.చివరిసారి నిమజ్జనం చేయడమేంటని ఆలోచిస్తున్నారా..? కానీ అదే నిజం. రాష్ట్రంలోనే అత్యంత భారీ వినాయకుడిగా పేరొందిన ఖైరతాబాద్ గణేష్‌కి దాదాపుగా ఇదే చివరి నిమజ్జనం.అదీ హుస్సేన్ సాగర్‌లో.వచ్చే ఏడాది ఇక్కడ నిమజ్జనం ఉండకపోవచ్చు.ఇంతకీ విషయమేమిటంటే.హుస్సేన్ సాగర్‌లో లక్షల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం నిమజ్జనాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇబ్బడిముబ్బడిగా గణేష్ ప్రతిమలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు కోర్టు నిరాకరించింది. నీటి వనరులు కాలుష్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.