నిబంధనలు మేరకు చవితి ఉత్సవాలు నిర్వహించాలి సబ్ కలెక్టర్ ఇలాక్కియా

TV77తెలుగు కోరుకొండ: ఈనెల 10 వ తేదీన వినాయక చవితి ఉత్సవాలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకునేలా ఉత్సవ కమిటీలను అధికారులు సమస్వయ పర్చాలని సబ్ కలెక్టరు ఇలాక్కియా సూచించారు. బుధవారం ఆమె స్థానిక సబ్ కలెక్టరు వారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహణ ముందస్తు చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణపతి ఉత్సవ విగ్రహాల ఎత్తు మూడు అడుగులు మించరాదని, విగ్రహ తయారీదారులు కూడా మూడు అడుగులలకు వించిన విగ్రహాలు తయారు చేసి విక్రయించరాదన్నారు. ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితంగా ఉండే మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలన్నారు. సామూహిక ఊరేగింపులు నిషేదమని ఆమె స్పష్టం చేసారు. పందిళ్ళు , ముఖ్య కూడళు పబ్లిక్ ప్రదేశాలు మార్కెట్లు అపార్టుమెంట్లు వీదులలో విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు. ఏవిధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదని ప్రస్తుతం కరోనా దృష్ట్యా ప్రజలందరూ ఇళ్లలోనే పూజాధికార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేయు గణపతి విగ్రహాలు ఎత్తు మూడు అడుగులలకు మించరాదన్నారు. దేవాలయ ప్రాంగణాలలోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. ఆలయాలు వద్ద ప్రజలు గుంపులు గుంపలుగా కాకుండా బౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం వంటి ప్రాధమిక చర్యలు ఆచరించేలా చర్యలు చేపట్టి దర్శనానికి అనుమతించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తీర్థ ప్రసాదాలు పంచరాదన్నారు. ఇంటి వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాలకు డిజె సౌండ్ కు అనుమతి లేదన్నారు. వినాయక చవితి రోజున, నిమజ్జనం రోజున ఊరేగింపులు జరపడం భక్తులు గుమిగూడి సమూహంగా నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. గణపడి నిమజ్జనానికి తప్పనిసరిగా పోలీసులు, స్థానిక సంస్థలు, రెవిన్యూ అధికారులు అనుమతి తీసుకొని వారు సూచనలు పాటిస్తూ వారు సూచనలు ప్రకారం నడుచుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. అనంతరం నిర్వహించే అన్నదాన కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటి నిర్వాహకులుతో మండల గ్రామస్థాయిలో సమావేశాలు వెంటనే నిర్వహించి కోవిడ్ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిబంధనలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఉల్లఘించినా వారిపై నిబంధన మేరకు కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పబ్లిక్ అడ్రస్సు సిస్టమ్ లు ఏర్పాటుచేసినా వెంటనే పోలీసులకు 100 కు పోన్ చేసి పిర్యాదు చేయాలని ఆదేశించారు. గోదావరికి ప్రస్తుతం వరదలు వస్తున్నందున ఈ నెల 10, 11,తేదీలలో గోదావరినదిలో ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. నవరాత్రుల 7,8, 9, రోజు నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణ కొరకు తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు యంత్రాంగం గణపతి ఉత్సవాల నిర్వహణలో ఉత్సవ కమిటీల ద్వారా కోవిడ్-19 నిబంధనలు పూర్తిగా ఆచరిరంపజేస్తూ పక్కాగా చర్యలు చేపట్టి శాంతిభద్రతలు సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మత్స్య శాఖ పడవలు, గజ ఈతగాళ్ళలను ఏర్పాటుచేయాలని, వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ఎ వినూత్న, డిప్యూటీ డిఎంహచ్ పి కోమల, ట్రాన్సుకో ఇం టి తిలక్ కుమార్, డిఎస్సీలు డి రామవర్మ, జెవి సంతోష్, వెంకటేశ్వరరావు, కెఎస్వి ప్రసాద్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉత్సవ కమిటీల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.