ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు డిప్యూటీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

TV77తెలుగు అమరావతి:
  ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు. సంబంధించి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే సాధారణ బడ్జెట్‌ లోపే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.జనగణన కొనసాగుతుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు.బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో విలీనం చేయటంపై ఆందోళన అవసరం లేదన్నారు.పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందన్నారు. ఇది పరిపాలనపరమైన సౌలభ్యం కోసం మాత్రమే మార్పు చేశామన్నారు.ఈ విలీనంతో రిజర్వేషన్లలో ఎటువటి మార్పు ఉండదన్నారు రఘుపతి.దేవదాయ శాఖ నిధులు బ్రాహ్మణ కార్పోరేషన్ బదలాయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు.ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని. అందుకే బ్రాహ్మణ కార్పోరేషన్ మార్పు చేయడం జరిగిందన్నారు.బ్రాహ్మణ సమాజంలో అత్యధిక మంది అర్చకులు ఉంటారన్న ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు దేవదాయ శాఖ ఉంచారన్నారు. ఈ మార్పుతో కార్పోరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలకు ఎటువంటి నష్టం వాటిల్లదన్నారు.