మూడు చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించారరూ.... ప్రభుత్వానికి దివ్యాంగురాలు వేడుకోలు

TV77తెలుగు రాజమహేంద్రవరం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఏదో విధంగా పథకాలను అమలు చేస్తున్న వై ఎస్ జగన్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటార్ సైకిల్ పథకాన్ని ప్రవేశపెట్టాలని వేలాది మంది దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు స్థానిక అన్నపూర్ణ పేట, బోసు బొమ్మ వీధి కి చెందిన బోడసింగ్ రమణ ( 39 ) అనే మహిళ దివ్యాంగురాలు రెండు కాళ్లు లేక గత పది సంవత్సరాలుగా రోజు వారి దిన చర్యలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంది.ఎప్పుడో ఇచ్చిన మూడు చక్రాల సైకిల్ తుప్పు పట్టి వినియోగంలో లేదని బాధితురాలు వాపోయింది.ప్రభుత్వం దయ ఉంచి మూడు చక్రాల మోటార్ సైకిల్ ఉచితంగా అందించాలని వేడుకుంటుంది.దాతలు, స్వచ్ఛంద సంస్థలు దివ్యంగా రాలు పడుతున్న అవస్థలు చూసి స్పందించాలని వేడుకుంటుంది.